Bavalla Na Bavalla Song lyrics | Shirisha |
Singer | Shirisha |
Composer | Madeen Sk |
Label | Sytv.in |
Song Writer | Thirupathi Matla |
Lyrics
గున్నగున్న మామిళ్ళల్ల… గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలీయ రాయే నువ్వు బావల్ల
గున్నగున్న మామిళ్ళల్ల… గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలీయ రాయే నువ్వు బావల్ల
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల..! నా ముద్దు ముద్దుల బావల్ల
ఎండీ మబ్బులు కరగవట్టి బావల్ల
ఎన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపావట్టే బావల్ల
సలి దుప్పటి వెయ్యి రారా బావల్ల
సీకటి తెల్లారేదాకా రాతిరితో రామగోస
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
సుడాముద్దు సుక్కాపొద్దు బావల్ల
మక్కాసేను మంచే కాడ బావల్ల
సిలుకలను ఎల్లగొట్ట బావల్ల
గొడిసెలను వెయ్యి రారా బావల్ల
దాసుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్త
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
పూత పూత పువ్వుల సీరె బావల్ల
లేత లేత మల్లెపూలు బావల్ల
కోరి కోరి అడగబోతే బావల్ల
దొరకకుండా ఉరుకుతావు ఏందుళ్ళ
పచ్చని పజ్జొన్నమొలక… అత్తకు తొలిసూరు కొడుకా
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
నడి ఎండల జడి వానలు బావల్ల
ఆగకుండా కొట్టినట్టే బావల్ల
తీయనైన ఊసులాట బావల్ల
గుండెలోన గూసులాట బావల్ల
ఎడుమ కన్ను అదురబట్టే ఎదలో గిలికింత పుట్టే
బావల్ల నా బావల్ల… నా ఎండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల… నా ముద్దు ముద్దుల బావల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల