"Nuvvostanante Nenoddantana Adhire Adhire Song In Telugu | Siddharth, Trisha" Song Info
శివశివ మూర్తివి గణనాథా....శివశివ మూర్తివి గణనాథా....
శివుని కొమరుడవు గణనాథా....శివుని కొమరుడవు గణనాథా....
ఛల్ సిరికీ హరికీ మనువంట...ఛల్ సిరికీ హరికీ మనువంట...
భళరే అనరా జనమంతా...భళరే అనరా జనమంతా...
హేయ్..ఘల్లుమంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా
పల్లవి :
అదిరే అదిరే కన్నే అదిరే .... అదిరే అదిరే కన్నే అదిరే ....
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఓ.. ఓ..
చరణం : 1
ఏం మాయ మెలికో..కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో…అదేం పంటి కొరుకో
వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
హెయ్..వరసై పిలిచే అందాలు..
అరె మనమై చిలికే గంధాలు
మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా
అదిరే అదిరే కన్నే అదిరే ....కుదిరే కుదిరే అన్నీ కుదిరే...
చరణం : 2
పన్నీటి చినుకో…పసిడిపంట జిలుగో
కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
పందార తునకో…పదం లేని తెలుగో
మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేనాలూ
చెవిలో పడనీ మేళాలు
అరె..అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
మదన దీపిక మదిని మీటగా ఎదురు లేదుగా …
అదిరే అదిరే కన్నే అదిరే ....కుదిరే కుదిరే అన్నీ కుదిరే...