"Komm Uyyala lyrics in telugu " Song Info
Komma Uyyala Song Lyrics in Telugu
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
తెల్లారాలా పొద్దుగాల
అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా
గోరింట పెట్టాలె… గొరవంక దాయి
నెమలీకాలెట్టాలి నెలవంక దాయి
నెలవంక దాయీ..!!
కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి
దారెంట పోతున్న కుందేలు దాయి
దాయమ్మ దాయీ
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను… రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొప్పూనా పూలెడతా కోతిపిల్ల దాయి
టూగుటుయ్యల కడ్తా… తూనీగ దాయీ
తూనీగ దాయీ
ఈపూన కూసోని సెరువంతా తిరుగాలే
ఈతాలు నేర్సిన… తాబేలు దాయీ
దాయమ్మ దాయీ
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున… పాడే కోయిల
కూ అంటే… కూ అంటూ
నాతో ఉండాలా… నాతో ఉండాలా