"komaram bheemudu song lyrics in telugu" Song Info
పల్లవి : కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో
(కొర్రాసు నెగడు అంటే కొర్రాయి.. కాలే కట్టె చివర్లో జ్వాల)
కొమురం భీముడో .. కొమురం భీముడో..
రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో..
చరణం 1 :
కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల..( వంగితే కనుక)
కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో..
జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక)
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..(జుడుము అంటే అడవి)
కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో
చరణం 2 :
చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక)
సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. ( రక్తం చూసి ధైర్యం చెదిరితే కనుక)
బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక)
భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో..
కొమురం భీముడో.. కొమురం భీముడో..
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో
చరణం 3 :
కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో.. కొమురం భీముడో..
పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో..