Atu Nuvve Itu Nuvve song lyrics



"Atu Nuvve Itu Nuvve" Song Info

Song Name
Movie Name             Current
Directer
            Surya Pratap
Music Directer
Devi Sri Prasad
Cast
                   Sushanth, Sneha Ullal
Lyrics
                Ramajogayya Sastry,
Singer
                Neha Bhasin
Music label
       Aditya Music

Atu Nuvve Itu Nuvve Song Lyrics In Telugu

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా
ప్రతిచోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవుల పైనా
ప్రతి మాటా నువ్వే

అపుడో ఇపుడో ఎపుడైనా
నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని
నాకు రుచి చూపావులే

పరిచయమంతా గతమేనా
గుర్తుకురాదా క్షణమైనా
ఎదురుగ ఉన్న నిజమే
కాని కలవైనావులే

రంగు రూపమంటూ
లేనె లేనిదీ ప్రేమ
చుట్టూ శూన్యమున్నా
నిన్ను చూపిస్తూ ఉంది

దూరం దగ్గరంటూ
తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరి
నన్ను మాటాడిస్తుంది

కనుపాప లోతులో
దిగి పోయె ఎంతలా
ఒక రెప్పపాటు
కాలమైనా మరపేరావుగా
ఎద మారుమూలలో
ఒదిగున్న ప్రాణమై
నువ్వు లేని నేను లేనే
అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా
ప్రతిచోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవుల పైనా
ప్రతి మాటా నువ్వే

నాకే తెలియకుండా
నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయేలా
ప్రేమ గుణమై ఎదిగావే

మాటే చెప్పకుండా
నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ
నన్ను ఒంటరి చేసావే

ఏకాంత వేళలో
ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలిలేని
పంతాలేంటి ఇలా

నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమ నైనా ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా
ప్రతిచోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవుల పైనా
ప్రతి మాటా నువ్వే

"Atu Nuvve Itu Nuvve" Song Video

Song Name : Atu Nuvve Movie Name : Current Banner : Sri Nag Corporation Directer : Surya Pratap Music Directer : Devi Sri Prasad Cast : Sushanth, Sneha Ullal Lyrics : Ramajogayya Sastry, Singer : Neha Bhasin Music label : Aditya Music
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.