"Somma silli pothunnava song telugu lyrics" Song Info
Somma Silli Pothunnava Song Telugu Lyrics
కంటికి కునుకే కరువాయెనే
గుండెల బరువే మొదలాయెనే
సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
నల్ల నల్లాని కళ్ళతో
నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే
గుండె గాలిలో తేలుతు
ఆరాటలాడుతూ నీ ఒళ్ళో నే వాలెనే
సుట్టు దిప్పుకున్నావే
ఓ సిన్నా రాములమ్మ
సెమట సుక్కోలే తీసెయ్యకే
నీ సీర కొంగుకే ముడివెయ్యవే
సాయంకాలం వేళ
సందె పొద్దులాగ సెంతలోనే ఉండవే
సీకటేల మెరిసే
సుక్కలాగ గుండెలోన దాగవే
నీటిలోన నీడ చూస్తుంటే
ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే
నీ చేతినద్దేసి కలలన్ని చెరిపేసి
కాలాన్ని మార్చకే
ఎక్కడున్నా ఎదురయ్యే
నీ సన్నజాజి నవ్వులే
సక్కనైన సొగసులే
నాకిచ్చి స్వర్గంలో బంధించవే
ఏటి గట్టు మీద ఎదురుసూపుల్లోన
కళ్ళల్లో నిండినవే
గాలివానల్లోన గొడుగల్లే
రమ్మన్న వెచ్చగా కౌగిలికే
నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న
నా దరికి రమ్మంటినే
నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా
నా అడుగు నీ జాడకే
ముద్దుగున్నా నా చెలివే
ఓ సిన్నా రాములమ్మ
సెంత సేరే రోజెన్నడే
ప్రాణం అల్లాడే నీకోసమే
పారేటి సెలయేరు పలకరించకున్నా
పరువాలేదనుకుంటినే
ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా
పట్టించుకోవెందుకే
పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ
నీ చెంత చేరిస్తినే
పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి
మనువాడుకుంటానులే
జన్మ జన్మాల బంధానివే
ఓ సిన్నా రాములమ్మ
నా సీకటి బ్రతుకుల ఎలుగియ్యవే
నా ఇంటి దీపాన్ని ఎలిగించవే