"sid sriram Kadalalle ||కడలల్లె వేచె కనులే" Song Info
Kadalalle Lyrics in Telugu
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
ఒడి చేరి ఒకటైపోయే
ఒడి చేరి ఒకటైపోయే
తీరం కోరే ప్రాయం
విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే
అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంత చేరి సేదతీరే ప్రాయమిలా
చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా
కాలాలు మారినా
నీ ధ్యాస మారునా
(కాలాలు మారినా
నీ ధ్యాస మారునా)
అడిగింది మోహమే
నీ తోడు ఇలా ఇలా
విరహం పొంగెలే
హృదయం ఊగెలే
అధరం అంచులే
మధురం కోరెలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే
నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే నీవుగా
బుగ్గ మీద ముద్దే పెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండె లోతుల్లో
నీలోన చేరగా (నీలోన చేరగా)
నా నుంచి వేరుగా (నా నుంచి వేరుగా)
కదిలింది ప్రాణమే… నీవైపు ఇలా ఇలా