O Bangaru Rangula Chilaka Song Lyrics from Thota Ramudu - Chalam
"ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka" Song Info
Movie
Singers
Lyricist
వేటూరి
Music
చక్రవర్
label
Telugu one
ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే
సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
"ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka" Song Video
Movie :
తోటరాముడు
Singers :
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
, పి.సుశీల
Lyricist :
వేటూరి
Music :
చక్రవర్
label :
Telugu one