"Manohara song lyrics in telugu" Song Info
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి
నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట ఓ ప్రేమా ప్రేమా…..
సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం
దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక
వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం
నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
ఓసారి ప్రియమరా ఒడిచేర్చుకోవా నీ చెలిని
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల